4 September, 2026 | 3:49 PM

4 లైన్ల రోడ్ల విస్తరణకు 77.20 కోట్లు మంజూరు

19-10-2024 | 03:06pm

కరీంనగర్, (విజయక్రాంతి): ప్రస్తుతం రెండు లైన్స్ ఉన్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రాజీవ్ రహదారి 4 లైన్ల విస్తరణ కోసం ఫేజ్ 2 లో భాగంగా 77.20 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వెళ్ళే ప్రయాణికుల సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గార్లకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వైపు వచ్చే సమస్యలు పరిష్కారం అవుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ ప్రజలు.