2 August, 2026 | 6:16 PM

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

22-06-2024 10:36 AM

తిరుమల తిరుపతి దైవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి కంపార్టు మెంట్లన్నీ నింది ఏటీసీ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న 72,294 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,855 మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న రూ.3.39 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.