భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏరువాక పూజలు
22-06-2024 10:21 AM
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏరువాక పూజలు నిర్వహిస్తున్నారు. 'ఏరువాక పౌర్ణమి' సందర్భంగా సీతారాములకు విశేష అభిషేకం చేశారు. సీతారాములకు 81 వెండి కలశాలతో విశేష అభిషేకం చేశారు. అనంతరం రామయ్య సన్నిధిలో మహా పూర్ణాహుతి వేడుకలు నిర్వహించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మత విశ్వాశాల ప్రకారం పౌర్ణతి తిథులలో జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. 21 జూన్ 2024 శుక్రవారం నాడు 'జ్యేష్ఠ పౌర్ణమి' వచ్చింది. దీనిని 'ఏరువాక పౌర్ణమి' కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి తమ పొలాల్లో భూమి పూజ చేస్తారు. ఇది పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారం అని పెద్దలు చెబుతున్నారు. రైతులు పొలాల్లో ఎద్దులతో నాగలితో దుక్కిదున్నడాన్ని 'ఏరువాక' అంటారు.






