ప్రైవేటీకరణలో బీజేపీకి కాంగ్రెస్ సహకారం
హైదరాబాద్: రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి తన సమాధిలో గోబెల్స్ ఉలిక్కిపడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ యత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో బొగ్గుబ్లాకుల అమ్మకాలను బీఆర్ఎస్ వ్యతిరేకించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. చివరి రౌండ్ 2 బ్లాకులను కేంద్ర ఏకపక్షంగా వేలం వేసిందన్న కేటీఆర్ తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని విమర్శించారు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో బీజేపీ కాంగ్రెస్ సహకారం ఇస్తోందన్నారు. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని కేటీఆర్ తెలిపారు.






