తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు శనివారం వెల్లడించారు. 71,721 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలో భద్రతపై డీజీపీ, టీటీడీ ఈవో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయస్థాయిలో తిరుమలకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు అవసరమని డీజీపీ వెల్లడించారు.






