calender_icon.png 1 June, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్దర్‌ అవార్డు గ్రహీతలకు భారీగా నగదు ప్రోత్సాహకం

31-05-2025 09:06:34 AM

హైదరాబాద్: గద్దర్ ఫిల్మ్ అవార్డు(Gaddar Film Awards) గ్రహీతలకు భారీగా నగదు ప్రోత్సాహకం అందనుంది. నంది అవార్డులతో పోలిస్తే నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల(Gaddar Telangana Film Awards) కోసం సుమారు రూ. 25 కోట్లు కేటాయించింది. ప్రోత్సాహక నగదు బహుమతుల కోసం ప్రభుత్వం రూ. 6 కోట్లు వెచ్చించింది. ఒక్క ఉత్తమ చిత్రానికి రూ. 10 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి లభించనుంది. రెండో ఉత్తమ  చిత్రానికి రూ. 7 లక్షలు, మూడో ఉత్తమ చిత్రానికి రూ. 5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందనుంది. ఉత్తమ చిత్రానికి అవార్డు కింద నిర్మాతకు రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతి ఇవ్వనుంది సర్కార్. ఉత్తమ చిత్రానికి అవార్డు కింద దర్శకుడికి రూ. 5 లక్షల ప్రోత్సాహక బహుమతి దక్కనుంది. ప్రత్యేక స్మారక పురస్కార గ్రహీతకు రూ. 10 లక్షల ప్రోత్సాహక బహుమతి, వ్యక్తిగత అవార్డు గ్రహీతకు రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు ప్రోత్సాహక బహుమతిని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అందజేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 73 గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రదానం చేయనుంది.