calender_icon.png 15 October, 2024 | 11:31 PM

యాదాద్రిలో భక్తుల రద్దీ

16-09-2024 04:21:52 AM

స్వామివారి నిత్యాదాయం రూ. 40.05 లక్షలు

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుసగా నాలుగు రోజులు సెలవుల కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివ చ్చారు. స్వామివారికి భక్తుల నుంచి వివిధ కైంకర్యాల ద్వారా రూ.40,05,735 నిత్యాదాయం సమకూరింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మైనంపాటి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.