15 March, 2026 | 2:11 AM

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల పట్టివేత

14-03-2026 08:10 PM

చేగుంట: మండలంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, వాణిజ్య అవసరాలకు వాడుతున్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లపై స్థానిక తహసీల్దార్లు శివప్రసాద్, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టి చేగుంట పట్టణ కేంద్రంలోని శ్రీ కృష్ణ గ్రాండ్ హోటల్ 03, సమ్మెర్ ప్రీతీ షేర్ పంజాబీ ఫ్యామిలీ దాబా 04, తెలంగాణ ఫ్యామిలీ ధాబాలో 03, మక్కారాజ్ పేట్ వై జంక్షన్ ధాబా వద్ద 05, మండలంలో మొత్తం 12 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

చేగుంట పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ కంపనీలు ఉండడం వల్ల, ఇక్కడ వరస  కార్మికులు రావడం వల్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, గ్యాస్ రిఫీలింగ్ నిర్వహకులకు, మిర్చి హోటల్ లకు అధిక రూపాయలకు అక్రమ రవాణా చేస్తూ, ప్రజలదనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని,వీరి పైన తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 తాసిల్దార్ శివప్రసాద్

చేగుంట తహసీల్దార్ మాట్లాడుతూ... మండలంలో గృహ అవసర గ్యాస్ కు ఎటువంటి కొరత లేదు అని,మున్ముందు అవసరములకు కావలసిన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ఇట్టి విషయములో ఎవరును భయబ్రాంతులకు గురికాకూడదని, ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జై భరత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.