27 June, 2026 | 7:30 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

14-03-2026 07:46 PM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల: షెడ్యూలు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం జోగుళాంబ గద్వాల జిల్లా ఆధ్వర్యంలో షెడ్యూలు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాది అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ యువత ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సి యాక్షన్ ప్లాన్ 2025-26 ఆర్థిక సంవత్సరం క్రింద రూ.1.00 వరకు ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు (90% సబ్సిడీ), రూ.3.00 లక్షల విలువ గల త్రి చక్ర ఎలక్ట్రికల్ ఆటో (ప్యాసింజర్/గూడ్స్) వాహనాలకు (70% సబ్సిడీ), రూ.3.00 నుండి రూ.7.00 లక్షల వరకు(రూ.5.00 లక్షల వరకు 60% సబ్సిడీ) సోలార్ యూనివర్స్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగాల యూనిట్లను లోన్ క్రింద ప్రకటించడం జరిగిందన్నారు.

21-50 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్ధులు ఉపాధి హామీ పథకాలకు, 21-60 సంవత్సరాలలోపు అభ్యర్ధులు భూ సంబంధ, వ్యవసాయ సోలార్ పరికరాల పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంవత్సర ఆదాయం రూరల్ వారికి రూ.1.50 లక్షలు, అర్బన్ వారికి రూ.2.00 లక్షలు మించి ఉండరాదన్నారు.

కుల, ఒక సంవత్సరంలోపు ఆదాయ ధృవ పత్రాలు, ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ (FSC CARD) కలిగిన దారిద్ర రేఖకు దిగువన (BPL) అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  అర్హులైన అభ్యర్థులు TGOBMMS Online portal https://tsobmms.cgg.gov.in ద్వారా ధరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఈనెల 17 నుంచి 24 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, రూమ్ నెం.F-8, ఒకటవ అంతస్తు, ఐడిఓసి, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సంప్రదించవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్  పేర్కొన్నారు.