15 March, 2026 | 2:32 AM

భిక్కనూర్‌లో హెచ్‌పీ గ్యాస్ కొరత

14-03-2026 08:31 PM

వినియోగదారుల ఇబ్బందులు

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలో హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ కోసం వచ్చిన పలువురు వినియోగదారులు స్టాక్ లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయని, కొత్త స్టాక్ సోమవారం వరకు వచ్చే అవకాశం ఉందని నిర్వహకులు తెలిపారు. గ్యాస్ కొరత కారణంగా గృహిణులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. అధికారులు త్వరగా సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.