15 April, 2026 | 6:20 AM

ఒక అద్భుతమైన టెస్ట్ ప్రయాణం ముగిసింది

13-05-2025 12:00 AM
  1. కోహ్లీ నిబద్ధతతో క్రికెట్‌ను పునర్నిర్వచించారు
  2. ఎమ్మెల్యే హరీశ్ రావు

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): టీమిండియా స్టార్ బాట్స్ మెన్ విరాట్‌కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటర్మెంట్ ప్రకటించడంపై  ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు స్పందించారు. ఒక అద్భుతమైన టెస్ట్ ప్రయాణం ముగిసిందని, విరాట్ కోహ్లీ తన నిబద్ధత నాయకత్వంతో భారత క్రికెట్‌ను పునర్నిర్వ చించారని హ్యాష్‌ట్యాగ్ విరాట్‌కోహ్లీ అంటూ కోహ్లీని ట్యాగ్ చేస్తూ సోమవారం పోస్టు చేశారు. క్రికెట్‌లో మరపురాని క్షణాలను ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు. వన్డే ల్లో అతను విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. 

ధన్యావాదాలు కింగ్ కోహ్లీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

అరంగేట్రం నుంచి అత్యంత విజయవంతమైన టెస్ట్ క్రికెట్ కెప్టెన్టలో ఒకరిగా విరాట్ కోహ్లీ నిలిచారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తరతరాలుగా ఐకానిక్ బ్యాటర్లలో ఒకరుగా కోహ్లీ ఎదిగారని ఆమె కొనియాడారు.

విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడటమే కాకుండా దాన్ని ఉన్నత స్ధాయికి తీసుకువెళ్లారని కవిత ప్రశంసించారు. ఈమే రకు ఆమె సోమవారం ఎక్స్‌లో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటర్మెంట్‌పైన పోస్టు చేశారు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కో లు పలుకుతూ ఒక రికార్డును మా్ర తమే కాకుండా నమ్మకం, ఎప్పుడూ వెనక్కితగ్గని స్ఫూర్తిని కోహ్లీ మిగిల్చారని కవిత అన్నారు.