14 March, 2026 | 11:57 PM

ఏయూలో సిఎస్ఐ ఏఐ 100కె లీడర్‌షిప్, ఇంపాక్ట్ సమ్మిట్

14-03-2026 10:05 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో లీడర్‌షిప్, ఇంపాక్ట్ సమ్మిట్ శనివారం ఘనంగా నిర్వహించారు. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో విద్యార్థులను సిద్ధం చేయడం అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈసమ్మిట్ నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టరెడ్డి మాట్లాడుతూ... ఉన్నత విద్యలో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతికతలను పాఠ్యాంశాలలో చేర్చడం ద్వారా విద్యార్థులను భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అనురాగ్ విశ్వవిద్యాలయ ఛైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఒక విద్యాసంస్థ విజయవంతం కావాలంటే మూడు ప్రధాన స్తంభాలు అవసరమని పేర్కొన్నారు. అవి ఆధునిక మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, విద్యార్థులకు ప్రేరణ కలిగించే విద్యా వాతావరణం అని తెలిపారు. ఉత్తమ ప్రాజెక్టులకు రూ. 50వేలు బహుమతి నిధిను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు.