7 May, 2026 | 6:02 PM

సౌర విద్యుత్తును వినియోగించి పంటలను సాగు చేసుకోండి

07-05-2026 05:32 PM

బోథ్,(విజయక్రాంతి): అటవీ హక్కు పత్రాలు పొందిన గిరిజనులు సౌర విద్యుత్తును వినియోగించుకొని పంటలను సాగు చేసుకోవచ్చని విద్యుత్ శాఖ ఏడిఈ లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం . సోనాల మండల కేంద్రంలో రైతు వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి జి దేవా నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ యాంత్రిక రణ డ్రోన్ వినియోగం పై అవగాహన కలిగించారు, పీఎం కోసం ,పథకంలో సోలార్ విద్యుత్తు వినియోగంపై రైతులకు వివరించారు .కార్యక్రమంలో సోనాల తాసిల్దార్ ఏ మల్లేష్ స్థానిక సర్పంచ్ యాల బిందుజ ఉపసర్పంచ్ తుల శ్రీకాంత్ వార్డు సభ్యులు తుల హరీష్ సబ్ ఇంజనీర్ శ్రీ ఎండిల్ ఇన్స్పెక్టర్ పి లక్ష్మణ్ విద్యుత్ శాఖ సిబ్బందితోపాటు రైతులు పాల్గొన్నారు.