19 March, 2026 | 5:20 AM

పత్తి మధ్యలో గంజాయి సాగు

29-09-2024 12:07 AM

ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇ చ్చోడ మండలం గుబ్బతండాలో ప త్తి పంట మధ్యలో సాగు చేసిన 30 గంజాయి మొక్కలను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాణిక్‌రావు మూడెళ్లుగా భూమి కౌలుకు తీసుకు ని పంట సాగు చేస్తున్నాడు.

గంజా యి మొక్కలను పెంచుతున్నాడనే స మాచారంతో పోలీస్ సిబ్బంది శనివారం తనిఖీ చేశారు. పత్తిపంటలో ఉన్న 30 గంజాయి మొక్కలను సాధీనం చేసుకుని మాణిక్‌రావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ భీమేశ్ తెలిపారు. తనిఖీల్లో ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.