17 April, 2026 | 3:07 AM

ఫిట్‌నెస్ సాధించిన కమిన్స్

17-04-2026 01:05 AM

ముంబై, ఏప్రిల్ 16 : సన్ రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్ అందింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్ సాధించాడు. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని కమిన్స్ ప్రస్తుతం స్వదేశంలో ఉన్నాడు. అక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో అతను పాసయ్యాడు.

దీంతో మిగిలిన ఐపీఎల్ సీజన్‌లో ఆడేందుకు ఆసీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్యాట్ కమిన్స్ అనుకున్న సమయానికే భారత్‌కు రానున్నాడు. శుక్రవారం జట్టుతో చేరే అవకాశముందని సమాచారం. వెన్ను గాయం కారణంగా ప్యాట్ కమిన్స్.. యాషెస్ సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లోనూ అతడు ఆడలేదు. ఇదే సమస్యతో ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్‌లకు దూర మయ్యాడు. కానీ జట్టును ఉత్సాహపరిచేందుకు.. ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్లకు హాజరయ్యాడు.

మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడో లేడో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా రావాలని.. క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌కు సమాచారం అందించింది. దీంతో హుటాహుటిన ఆసీస్ వెళ్లిన అతడు.. పరీక్షలకు హాజరయ్యాడు. అక్కడ అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. కాగా కమిన్స్ ఇప్పుడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడని సమాచారం. ప్రస్తుతం కమిన్స్ లేకపో వడంతో ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్ లు ఆడిన సన్‌రైజర్స్ రెండు గెలిచి, మూడింట ఓడిపోయింది. రాజస్థాన్‌పై గెలుపుతో రన్ రేట్ పెరిగి పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి దూసుకొచ్చింది.