25 June, 2026 | 1:04 AM

విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు

25-06-2026 12:23 AM

కాప్రా తాసీల్దార్ మతిన్ హెచ్చరిక                                

జవహర్ నగర్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాప్రా మండల తాసిల్దార్ మతిన్ హెచ్చరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో బుధవారం కాప్రా మండల తాసిల్దార్ మతిన్ ఆదేశాల మేరకు జవహర్ నగర్ లో పలు ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు చేపట్టారని సమాచారం మేరకు తాసిల్దార్ ఆదేశాల మేరకు బుధవారం గిరధవార్ సత్యనారాయణ సమక్షంలో పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

ఈ సందర్భంగా తాసిల్దార్ మతిన్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే కటకటాల పాలు అవుతారని పలు అక్రమ కట్టడాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షనే ధ్యేయమని తెలిపారు. ఫైరింగ్ కట్ట సమీపంలో వెలసిన అక్రమ నిర్మాణాలను  పలు అక్రమ కట్టడాలను జెసిబి సహాయంతో కూల్చి వేసామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.