పార్ట్ టైం జాబ్ పేరిట మెడికోకు సైబర్ నేరగాళ్ల టోకరా..
నాగర్ కర్నూల్ జూన్ 5 (విజయక్రాంతి): తన ఉన్నత చదువుల కొరకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందిని చూడలేక పార్ట్ టైం జాబ్ కోసం ఆశించిన ఓ మెడికల్ కళాశాల విద్యార్థిని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కింది. వెయ్యి 2 వేల నుండి మొదలు ఏకంగా 95వేల దాకా దోపిడీకి గురైంది. గత రెండు రోజుల క్రితం తన వాట్స్‌అప్ నెంబర్ కి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా పార్ట్ టైం జాబ్ కొరకు అవకాశముందంటూ సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఇంస్టాగ్రామ్ వేదికగా చాటింగ్ ప్రారంభించారు.
మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వేస్తూ మెల్లిమెల్లిగా నగదు స్కాన్ చేయాలంటూ ఏకంగా 95వేల వరకు దోచుకున్నారు. చివరగా మరో లక్ష పంపాలని చేయాలని తప్పనిసరి జాబ్ గ్యారంటీ అంటూ చాటింగ్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఆ విద్యార్థిని నాగర్ కర్నూల్ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ గోవర్ధన్ వెంటనే సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి జాబ్ ఆఫర్ అంటూ సోషల్ మీడియా వేదికగా సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎంతో మందిని మోసగిస్తున్నారని జాగ్రత్త పడాలని సూచించారు






