6 July, 2026 | 1:20 AM

మండల నూతన కార్యవర్గం ఎంపిక

06-07-2026 12:12 AM

చిన్నంబావి, జూలై 5: మండల కేంద్రంలో ఆదివారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్ ఆధ్వర్యంలో మండల నూత న కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.ఏఐవైఎఫ్ మండల నూతన అధ్యక్షుడుగా మోహన్, కార్యదర్శిగా పరమేష్, ఉపాధ్యక్షులుగా శ్రీ రాములు, భరత్, సహాయ కార్యదర్శిలుగా సూర్య ప్రకాష్, లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల పో లీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, జీవో నెంబర్ 48 ని రద్దు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ నియామకాల్లో పారదర్శకతను పాటించాలని  కోరారు.ఈ కార్యక్ర మంలో  చంద్రశేఖర్,హరనాథ్,వినయ్,గ ణేష్,శివ,యుగేందర్,మహేష్,భారత్ తదితరులు పాల్గొన్నారు.