సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు
మరోసారి చైర్మన్‌గా ఎన్నికైన ‘అల్ఫోర్స్‘ నరేందర్ రెడ్డి
కొత్తపల్లి, మార్చి 20 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం ఎన్నుకున్నారు. చైర్మన్ గా ‘అల్ఫోర్స్‘ నరేందర్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే నూతనంగా అధ్యక్షునిగా డాక్టర్ కెప్టెన్ బి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సురభి వేణుగోపాల్, కోశాధికారిగా విజగదీశ్వర చారి, ఉపాధ్యక్షులుగా ఎం అరవింద్, ఎస్ రాజయ్య, ఎస్ అనుదీప్, సంయుక్త కార్యదర్శిగా ఎస్ ఇంద్రవేశ్, వీ రమేష్, జై నరేష్ లను ఎన్నుకున్నారు.
ఈ సంఘానికి ఫ్యాట్రన్స్ గా డాక్టర్ బంగారు స్వామి, ఎస్.కోదండరాములు వ్యవహరించనున్నారు. ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్రం నుండి ఏ.కిషన్, జిల్లా యువజన క్రీడ విభాగం నుండి పవన్, ఒలంపిక్ అసోసియేషన్ పత్రినిధి జనార్దన్ రెడ్డి, రిటర్నింగ్ ఆఫీసర్ గా, మాజీ కార్పొరేటర్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి టి రమేష్ రెడ్డి వ్యవహరించగా పలువురు ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.




