మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, మార్చి 20 (విజయ క్రాంతి):జిల్లాలో మహిళా శిశు దివ్యాంగులు,వయో వృద్ధుల సంక్షేమ శాఖ పథకాలు, కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, వివిధ కార్యక్రమాల అమలు తీరుపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అక్షయపాత్ర భోజనం, పోషణ్‌అభియాన్, పౌష్టిక ఆహారం,భేటీ బచావో.. భేటీ పడావో, అభివృద్ధి పనులు అంశాలను ఇంఛార్జి జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, ఆయా విభాగాల అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ లోప పోషణ ఉన్న సామ్, మామ్ చిన్నారుల పట్ల ఆరోగ్యవంతంగా, బరువు పెరిగేవిధంగా మహిళా శిశు సంక్షేమ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు.
బాలలకు సంబంధించి ఫిర్యాదుల కోసం ఉన్న చైల్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బాల్య వివాహాల నిలుపుదల/ నిర్మూలనపై ఈ నెల 26 న పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీడీపీవోలు స్వరూప, ఉమా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సింధురాణి, ఇంచార్జి డీసీపీవో ప్రవీణ్ కుమార్, ఎఫ్ ఆర్ వో రవికృష్ణ, సఖీ కేంద్రం అడ్మిన్ హైమావతి, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్ లైన్ కో ఆర్డినేటర్ భాస్కర్, డీహెచ్ డబ్ల్యూ కో ఆర్డినేటర్ కళ్యాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.




