15 July, 2026 | 5:45 AM

సైయంట్ డీఎల్‌ఎం నికర లాభం 23 శాతం వృద్ధి

24-04-2024 01:01 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వ హిస్తున్న ఐటీ కంపెనీ సైయంట్ సబ్సిడరీ అయిన సైయంట్ డీఎల్‌ఎం నికరలాభం మార్చితో ముగిసి న క్యూ4లో త్రైమాసికంవారీగా 23.3 శాతం వృద్ధిచెంది రూ.22.7 కోట్లకు చేరింది. 2023 డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ.18.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో నమోదుచేసిన రూ.12.6 కోట్లతో పోలిస్తే తాజాగా ముగిసిన త్రైమాసికంలో 80 శాతం వృద్ధిచెందింది. కంపెనీ ఆదాయం స్వీక్వెన్షియ ల్‌గా 12.7 శాతం వృద్ధిచెంది రూ. 321 కోట్ల నుంచి రూ.362 కోట్లకు పెరిగింది. వార్షికంగా ఆదాయం 30 శాతం పెరిగింది. ఫలితాల నేపథ్యం లో సైయంట్ డీఎల్‌ఎం షేరు బీఎస్‌ఈలో 2.8 శాతం పెరిగి రూ.687 వద్దకు చేరింది.