15 July, 2026 | 5:32 AM

వొడాఫోన్ ఐడియా అదుర్స్

24-04-2024 01:02 AM

ఎఫ్‌పీవో ఇన్వెస్టర్లకు 30 శాతం లాభం

ముంబై, ఏప్రిల్ 23: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా జారీచేసిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీ వో) 6 రెట్లుకుపైగా ఓవర్ సబ్‌స్క్రయిబ్‌కావడంతో ఆ షేరు మంగళవారం పెద్ద ర్యాలీ జరిపింది. 11.3 శాతం పెరిగి రూ.14.40 వద్ద ముగిసింది. ఎఫ్‌పీవోకు నిర్ణయించిన అప్పర్ ప్రైస్‌బ్యాండ్‌తో పోలిస్తే 30 శాతం లాభంతో ముగియడం గమనార్హం.

వోడాఫోన్ ఐడియా మొత్తం 1,260 కోట్ల షేర్లను జారీచేయగా అందేసరికి 8,012 కోట్ల  షేర్లు బిడ్ అయ్యాయి. ఆఫర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు జోరు గా పాల్గొన్నారు. సంస్థల కోసం రిజ ర్వ్ చేసిన షేర్లకు దాదాపు 17 రెట్లు బిడ్ చేశాయి. హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల క్యాటగిరీ 1.41రెట్లు ఓవర్ సబ్‌స్క్రయి బ్ అయ్యింది. ఎఫ్‌పీవోలో షేర్ల కేటాయింపు జరిగిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి ఏప్రిల్ 24న ఆ షేర్లు జమ అవుతాయి. అలాగే షేర్లు లభించనివారికి రిఫండ్స్ ప్రక్రియను సైతం ఇదేరోజు కంపెనీ ప్రారంభిస్తుంది.