28 August, 2026 | 8:10 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

‘పాతాళ గంగ’లో 3వేల సిలిండర్లు

10-07-2026 12:52 AM
  1. ముంబైలో కూలిన హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ గోడ
  2. ప్లాంట్‌లోకి పోటెత్తిన వరద

ముంబై, జూలై 9 (విజయక్రాంతి): ముంబైలో భారీ వర్షాలకు హెచ్‌పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ గోడ కూలిపోయింది. దీంతో ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. 3వేల సిలిండర్లు పాతాళ గంగ నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అలా కొట్టుకుపోయి ఒడ్డుకు వచ్చిన సిలిండర్లు పేలే ఆస్కారం ఉండడంతో అధి కార యంత్రాంగం అప్రమత్తమైంది.

రాయగఢ్ కలెక్టర్ కిషన్ జావ్లే మాట్లాడుతూ.. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సిలిం డర్ల వద్దకు ఎవ్వరూ వెళ్లవద్దని, స్థానిక అధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. వాటిలో గ్యాస్ ఉం దో, లేదో, వరదల కారణంగా అవి లీక్ అయ్యే ప్రమాదం ఉందని, వాటికి దూ రంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. నదిలో కొట్టుకుపోయిన సిలిండర్లను స్వాధీనం చేసుకునేందుకు చర్య లు చేపట్టామని కలెక్టర్ వివరించారు.