28 August, 2026 | 8:22 PM

డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి

28-08-2026 07:46 PM

శివ్వంపేట,(విజయక్రాంతి): మండల కేంద్రమైన శివ్వంపేటకు చెందిన 7వ తరగతి(ఎంజేపీ ప్రభుత్వ హాస్టల్ నర్సాపూర్ (రావేల్లి ) విద్యార్థిని రాజిపేట ఆరాధ్య డ్రై ఫ్రూప్ట్స్ అంజీరా పండు, కిస్మిస్, మఖానా, బాదం, కాజు, పిస్తా, దారం ఉపయోగించి రాఖీలు స్వంత ఆలోచనతో తయారు చేసింది. శుక్రవారం రాఖీ పౌర్ణమి సందర్బంగా అన్న ఆదిత్యకు కట్టింది. పప్పులు, ఆకులతో కూడా రాఖీ తయారు చేసింది.

వీటిని వృథాగా పారేయకుండా మళ్లీ తినే విధంగా ఉపయోగ పాడుతాయని చిన్నారి ఆలోచన. ప్లాస్టిక్, రసాయన, కవర్లతో తయారు చేసినవి కొనుగోలు చేసి కట్టడంతో అవి వృథా అవుతున్నాయని తెలిపారు. వాటికీ వినియోగించే డబ్బు డ్రై ఫ్రూట్స్ కు వినియోగించి తిరిగి తినేందుకు దోహద పడుతుందని చిన్నారి ఆలోచన. గత ఏడాది కూడా ఎలాంటి రాసాయనాలు, ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగుంచకుండా కాగితాలు ఉపయోగించి రాఖీలు తయారు చేసి కట్టింది.