28 August, 2026 | 8:39 PM

ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి

28-08-2026 07:36 PM

సిపిఎం మండల కార్యదర్శి ఎం నరేష్

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేడ్చల్ మండల సిపిఎం కార్యదర్శి ఎం నరేష్ రాష్ట్ర ప్రత్భవాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపల్ పట్టణంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో గోడ పోస్టర్ ను విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విధ్యా సంస్థల్లో అధిక ఫీజులు, వివిధ పేర్లతో అదనపు వసూళ్లు పుస్థకాలు, యూనిఫారాలు, రవాణా తదితర ఖర్చులతో విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నారని రమేష్ ఆరోపించారు.

విద్యను లాభాపేక్షతో నడిపే విధానాన్ని అరికట్టాలని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా తల్లిదండెలు, ఉపాద్యాయులు,విద్యార్థుల ప్రతినిధులకు నియంత్రణ కమిటీలో స్థానం కల్పించాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం నరేష్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఎన్ కృష్ణ.శ్రీను.ఎల్లం తదితరులు పాల్గొన్నారు.