సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్
28-08-2026 07:57 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో శుక్రవారం కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి రాఖి కట్టారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిఫలం ఇచ్చే రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం ఎంతో ఆనందంగా ఉందని కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూ ప్రియ తెలిపారు.






