14 April, 2026 | 12:19 PM

పిడుగుపాటుకు పాడి ఆవు, కాడెద్దులు మృతి

14-04-2026 10:42 AM

చేవెళ్ళ,(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో సోమవారం రాత్రి ఈదురు గాలుల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చేవెళ్ళ మున్సిపల్ కు చెందిన ఒడ్డె జంగయ్య రైతు ఇప్పటి మాదిరిగా కాదెద్దులు ఓక పాడి ఆవును పొలంలో చెట్టుకింద కట్టేసి ఇంటికి రాగ అర్ధ రాత్రి పిడుగు పడి మృతి చెందాయి. మున్సిపల్ పరిధిలోని పామెన (8వ వార్డు)కు చెందిన గోల్కొండ వెంకటేష్ పాడియావును పొలం వద్ద కట్టేసి ఇంటికి రాగా పిడుగుపాటుకు మృతి చెందింది. ఈ ఘటనపై రైతులను ఆరా తీయగా పశువులకు ఎలాంటి ఇన్సూరెన్స్ చేయించలేమని తెలిసింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.