ఇంటర్ ఫలితాల్లో న్యూ ఎరా ప్రభంజనం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఎంపీ సీ, బైపీసీలో స్టేట్ ర్యాంకులు సాధించి కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా తమ విద్యార్థులు ఫలితాలు సాధించారని చిక్కడపల్లిలోని న్యూ ఎరా కళాశాల డైరెక్టర్ భాష్యం శ్రావణకుమార్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ఇంటర్ మొదటి, రెండో సం వత్సరం ఫలితాల్లో న్యూ ఎరా జూనియర్ కళాశాల రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉన్నదన్నారు.
ఎంపీసీ మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయిలో నూతన మార్కులు పి అస్మిత 438 బైపీసీ, అనిత్ హర్షిత 433 బైపీసీ, ఎం తరుణ్ శ్రీనివాస్ 464 ఎంపీసీ,కే ప్రవీణ్ శ్యామ్ సుం దర్ 463 ఎంపీసీ, శివం శంకర్ బిరదర్ 47 6 ఎంఈసీ, నితీష బిరదార్ 471 ఎంఈ సీ మార్కులు, రెండవ సంవత్సరంలో ఎంపీసీ ఆర్తి 990, ఎం .నూతన 986 ఎంపీసీ మార్కులు, బైపీసీలో జి. అర్జు న్ 991, సీమ సదాప్ 935,ఎంఈసీ యాష్ అగర్వాల్ 931, సీఈసీ పి వసంత లక్ష్మి 958 మార్కులను సాధించారు. వారిని డైరెక్టర్ డాక్టర్ భాష్యం శ్రవణ్ కుమార్ అభినందించారు.




