5 July, 2026 | 12:57 PM

సంక్రాంతికి వస్తున్న ప్రత్యేక గీతమిదే

24-12-2024 12:00 AM

వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే మేకర్స్ సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభించారు. భీమ్స్ సిసిరోలి యో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్‌ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నంబర్‌ని కంపోజ్ చేశారు.

రామోజీ ఫిలిం సిటీలో వేసిన అద్భుతమైన సెట్‌లో హీరో వెంకటేష్, హీరో యిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌పై ఈ పాటను చిత్రీకరిస్తు న్నారు. పోస్టర్‌లో వెంకటేశ్ ఐశ్వర్య, మీనాక్షితో పాటు ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కని పించారు. అంతా సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్‌గా కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ నిర్మిస్తు న్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.