విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు
ఆనందపురం: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం లొడగలవానిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండుకు( Pandu Master injured) తీవ్ర గాయాల పాలయ్యారు. పండు తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో 'Dhee'లో తన ఉత్సాహభరితమైన ప్రదర్శనలకు గాను మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అర్ధరాత్రి ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఒక కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో అతని కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉందని, అయితే వైద్యులు అతని గాయాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానాకి గురైన మూడువాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.






