వంద దేవుళ్లు వచ్చేది అప్పుడే
‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో ‘వంద దేవు ళ్లు’ అనే చిత్రం రాబోతోంది. సర్వంత్ రామ్ క్రి యేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తుండగా.. స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలా జీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడం గి వడివేలు తదితరు లు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్.
ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వదిలిన పోస్టర్‌లో హీరో, హీరోయిన్ సైకిల్ మీద సింపుల్‌గా వెళ్తున్న తీరు చూస్తుంటే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది. ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ఈ సినిమానను రూపొందించారు. ఈ చిత్రానికి ఎస్‌బీ దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. హరీశ్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్యశ్రీ డైలాగ్ రైటర్‌గా పనిచేశారు.






