29 August, 2026 | 12:30 PM

Breaking News

ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •   బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం   •   పెద్దమ్మ గుడిలో విషాదం.. ప్రాణం తీసిన కొత్త కారు   •   గుండెపోటుతో రంగాపూర్ సర్పంచ్ గోవు అంజమ్మ మృతి   •  

దంచు దంచు.. బాగా దంచు

09-12-2024 12:00 AM

పాతకాలంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువు ల్లో రోలు, రోకలి ఒకటి. ఇవీ ప్రతి ఇంటిలోనూ ఉండేవి. ఆ కాలంవాళ్లు మిరపకాయలు, పసుపు కొమ్ములు, నువ్వులు, ధాన్యాలు మొదలగు వాటిని రోలులో వేసి రోకలితో దంచేవారు. రోకలితో వాటిని దంచినపుడు పొడిగా తయారవుతాయి. ఈ పొడులను వాడేవారు. అయితే వీటి తర్వాత అనేక రకాలు మిక్సీలు వచ్చాయి. అప్పటికప్పుడు పోపులోకి వెల్లుల్లో, టీలోకి అల్లాన్ని పేస్ట్‌గా చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే పొడులు, పచ్చళ్ల తయారీలో రోలు, రోకలికి మించినది ఏదీ సాటిరాదంటారు మన పూర్వీకులు. అందుకే తెలంగాణలోని కొన్ని పల్లెల్లో గ్రామీణలు మహిళలు నేటికీ రోలు, రోకలి వాడుతున్న దృశ్యాలు చూడొచ్చు. మన సినీ రచయితలు వీటిపై పాటలు అల్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.