29 August, 2026 | 11:34 AM

గుండెపోటుతో రంగాపూర్ సర్పంచ్ గోవు అంజమ్మ మృతి

29-08-2026 11:02 AM

షాద్ నగర్ ఆగస్టు 29 (విజయక్రాంతి): నందిగామ మండలం రంగాపూర్ గ్రామ సర్పంచ్ గోవు అంజమ్మ శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గోవు అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.