29 August, 2026 | 11:56 AM

Breaking News

బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

29-08-2026 11:24 AM

లారీని ఢీకొన్న డీసీఎం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎర్రవల్లి , ఆగస్టు 29: జాతీయ రహదారి ఎన్‌హెచ్-44పై(National Highway NH-44) గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచుపల్లి వద్ద టర్నింగ్ తీసుకుంటున్న లారీని హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డీసీఎం వాహనం డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్న లారీ డ్రైవర్(Lorry driver) ఘటన అనంతరం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.