ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ పార్మర్
పట్టించుకోని విద్యుత్ అధికారులు
చండూరు,(విజయక్రాంతి): చండూరు మండల పరిధిలోని ధోని పాముల నుండి నేర్మటకు పోయే ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉంది. ఈ ట్రాన్స్ పార్మర్ చుట్టూ కంచ లేకుండా ఉంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నేర్మట గ్రామం నుండి చండూరు మున్సిపల్ కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులు బిక్కు బిక్కుమంటూ ప్రయాణిస్తుంటారు. రాత్రి సమయాల్లో వాహనాదారులు ఏమి జరుగుతుందేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఈ రోడ్డు పక్కన కంప చెట్లు విపరీతంగా పెరిగిపోవడంతో, ఈ రోడ్డు పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉండడం చాలా ప్రమాదకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రైతులు పత్తి చేను, పంట పొలాలు వేసుకుంటారు. మూగజీవాలు మేతకు తిరిగే సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అదే ప్రాంతంలో వేరొక చోట ట్రాన్స్ పార్మర్ ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ విషయంపై విద్యుత్ అధికారులు స్పందించి ఆ ట్రాన్స్ఫార్మర్ చాలామంది రైతులకు అవసరం కాబట్టి అదే ప్రాంతంలో వేరొక చోట ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






