4 September, 2026 | 2:07 AM

బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యమే లక్ష్యం

15-06-2025 | 04:45pm

మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకలు, రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు..

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యమే లక్ష్యంగా ముందుకుసాగాలని మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకలు, రాష్ట్ర అధ్యక్షులు కటకం నర్సింగరావు(State President Katakam Narsing Rao) అన్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో వెనుకబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీ ఉద్యమకారులతో, వివిధ కుల సంఘాలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించామని, గ్రామగ్రామాన మన ఆలోచన సాధన సమితిని విస్తరింప చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న బీసీలు రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, మనందరం కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మండల అధ్యక్షులు, ముదిరాజ్ చైతన్య వేదిక మునుగోడు ఇన్చార్జి కొండల్, మర్రిగూడ మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య, మేర రవి, పగడాల రఘు, మహేష్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.