24 June, 2026 | 10:23 PM

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి: సామాజిక ఉద్యమకారుడు కొమ్ము గణేష్

15-06-2025 04:34 PM

చండూరు,(విజయక్రాంతి): రైతు భరోసా(Farmer Assurance) నిధులను వెంటనే విడుదల చేయాలని, నూతన భూభారతి చట్టం(Bhu Bharathi Act) ద్వారా రైతు భూ సమస్యలు పరిష్కరించాలనీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొమ్ము గణేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి సంవత్సరన్నర కాలం గడుస్తున్న ఇప్పటికే రెండు సీజన్లు (ఖరీఫ్ ,రబీ) ఈ వర్షాకాలం తో మూడు సీజన్లు అవుతాయని చెప్పారు ఇప్పడి వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని పంటలను సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు పెట్టుబడి కోసం అందించే రైతు భరోసా ను వెంటనే అందించే విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. కొందరు రైతులకు గత రెండు సీజన్ల డబ్బులుతో కలుపుకొని మొత్తం మూడు సీజన్లు రైతు భరోసా నిధులు ఒకటేసారి విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న రైతు రుణ మాఫీ 2 లక్షలు వరకు రైతుల అందరికి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలను పురుగు మందులను అరికట్టాలనీ కోరారు. వ్యవసాయం అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు  చేపట్టి నకిలీలను అరికట్టాలని ఆయనడిమాండ్ చేశారు.