ప్రమాదకరంగా పాత వంతెనలు
ఇరుకు వంతెనల వద్ద హెచ్చరిక బోర్డులు కరువు
శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలపై నుంచి ప్రయాణం ప్రాణ సంకటం
అదిలాబాద్ జిల్లాలో పలు పాత వంతెనలు ప్రమాదకరంగా మారడంతో వాటిపై నుండి ప్రయాణం చేయాలంటేనే ప్రాణ సంకటంగా మారుతుంది. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలు ప్రమాద గంటికలను మోగిస్తున్నాయి. శిథిలావస్థకు చేరిన, ఇరుకైన వంతెనలతో ఎన్నో ప్రమాదాలు జరిగిన పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వంతెనలపై నుండి లారీలు, బస్సులు, కార్లు పడి ప్రమాదాలు జరగక, తాజాగా ఉట్నూరు మండలంలోని షాంపూర్ వంతెనపై నుండి ఆర్టీసీ బస్సు పడి పలువురికి గాయాలైన ఘటనతోనైన అధికార యంత్రాంగం స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉట్నూర్, ఫిబ్రవరి 2౫ (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారి అయిన గుడిహత్నూ ర్, ఉట్నూర్ మండలంలోని రహదారిపై దశాబ్దాల క్రితం నిర్మించిన పాత వంతెనలు ప్రయాణికులను, వాహన చోదకులను వణికిస్తున్నాయి. ఈ రహదారిపై పురాతన వంతెనలే దర్శనమిస్తున్నాయి. వందేళ్ల క్రితం నిర్మించిన వంతెనలు శిథిలా వ్యవస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. భారీ వాహనాలతో పాటు బస్సులు ఇతర వాహనాలు వంతెనలు దాటే సమయంలో ఊగుతూ ప్రయాణికులను వన్నికిస్తున్నాయి. పురాతన వంతెనలను తొలగించి కొత్త వంతెన నిర్మించుటకు
ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు వంతెనల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 2022- 23 సంవత్సరంలో ప్రతిపాదనలు పంపించారు. అధికారులు పంపిన ప్రతిపాదనలకు 9 కోట్లు మంజూరు చేశారు. మంజూ రైన నిధులకు అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు పొందిన గుత్తేదారులు వంతెన పను లు పూర్తి చేస్తామని అగ్రిమెంట్లు సైతం చేసుకున్నారు. ఇద్దరు గుత్తేదారులు తీసుకున్న పను లు నేటికీ ప్రారంభించలేదు. పనులు చేపట్టాలని ఆ శాఖ అధికారులు గుత్తేదారులకు నోటీ సులు జారీచేసిన గుత్తేదారులు పనులు ప్రారంభించేందుకు ముందుకు రావడం లేదు. పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని, తిరిగి టెండర్లు వేసి వేరే గుత్తేదారులకు పనులు అప్పగించాలని అధికారులకు జవా బు పంపినట్లు తెలిసింది.
నాగపూర్ వాగుపై బ్రిడ్జికి 4 కోట్లతో ప్రతిపాదనలు
2022 సంవత్సరంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు ఉట్నూర్ మండలం నాగపూర్ వాగుపై కొత్త వంతెన నిర్మించేందుకు రూ . 1.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మం జూరైన నిధులకు టెండర్లు పిలిచిన, పనులు ప్రారంభం కాలేదు. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రహదారిపై రాకపోకలు సాగిస్తాయని, మంజూరైన నిధులతో వంతెన పనులు పూర్తికావని ఆర్ అండ్ బి అధికారులు నిర్ణయానికి వచ్చారు. అధికారులు తిరిగి కొత్త ప్రతిపాదనలను రూ. 4 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పించారు. ప్రభుత్వం నుండి నాలుగు కోట్లు మంజూరు అయితే నాగపూర్ వాగుపై వంతె న పనులు ప్రారంభమవుతాయి.
గుత్తేదారులు ముందుకు రావడం లేదు: నర్సయ్య, ఈఈ ఆర్‌అండ్‌బీ శాఖ
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు తమ శాఖ ద్వారా టెండర్లు పిలిచి క్లాస్ వన్ గుత్తేదారులైన ముంతాజ్, కోటేశ్వర్ రెడ్డిలకు పనులు అప్పగించాం. 2023లో పనులు తీసుకున్న గుత్తేదారులు నేటికీ పనులు ప్రారంభించడం లేదు. పనులు పూర్తి చేయాలని గుత్తేదారులపై ఒత్తిడి తీసుకు వస్తున్న ప్రభుత్వం నుండి బిల్లులు రావడం లేదని పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.
నిర్మాణాలపై శ్రద్ధ చూపని ప్రభుత్వం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మంచిర్యాల, కొమురం భీం జిల్లాలతో పాటు కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిపై ఎన్నో వంతెనలు శిథిలావస్తకు చేరుకున్నాయి. వంతెనలను పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. 2022-23 ప్రభుత్వం మంజూరు చేసిన తొమ్మిది కోట్లతో పనులు ప్రారంభించవలసి ఉన్న నేటికీ పనులు ప్రారంభం కాలే. గుడియాత్నూర్ నుంచి ఉట్నూర్ రహదారిపై గల వంతెనల వద్ద తరచు ప్రమా దాలు జరుగుతున్న అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా చర్యలు తీసుకొని, వచ్చే వర్షాకాలంలో గా వంతెనలు నిర్మించాలి. లేకుంటే వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి.
పూర్కా బాపూరావు, తుడుందెబ్బ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు




