24 August, 2026 | 11:44 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

గిరిజన ప్రాంతాలలో కేంద్రం ప్రవేశపెట్టిన దార్తి అబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన క్యాంపులు

25-06-2025 10:45 PM

ఇప్పటికీ పూర్తయిన ఏడు సదస్సులు..

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దార్తి అబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన(Dirty Abajan National Gram Utkarsh Abhiyan Yojana) క్యాంపులు ఐటీడీఏ ఏజెన్సీ ఏరియా పరిధిలో 07 మండలాలలో 07 గ్రామాలలో క్యాంపులు నిర్వహించి సంబంధిత అధికారుల ద్వారా గ్రామసభలలో గిరిజనులు వివిధ పథకాలకు నమోదు సంబంధించిన కార్డుల రిపోర్టు అధికారుల ద్వారా తెప్పించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) బుధవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 

ఏజెన్సీ ఏరియా పరిధిలోని మండలాలు బూర్గంపాడు, చర్ల, పాల్వంచ, సుజాతనగర్, ఆళ్లపల్లి, అశ్వరావుపేట, ములకలపల్లి మండలాలలో గ్రామపంచాయతీ, ఎంపీపీ పాఠశాలలో 07 సదస్సులు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులకు 925 మంది గిరిజనులు పీఎం కిషన్, ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, జన్ధన్, కులం సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కార్డుల కోసం పేర్లు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, తాసిల్దారులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పంచాయతీ సెక్రటరీలు మీసేవ సెంటర్ ప్రతినిధుల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయించడం జరిగిందని ఆయన అన్నారు.