calender_icon.png 22 February, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న రవీంద్ర భారతిలో దరువు జాతర

22-02-2026 02:01:34 AM

ఖైరతాబాద్, ఫిబ్రవరి 21 (విజయాక్రాంతి): తెలంగాణ భూమి పుత్రుల పండగ తెలంగాణ దరువు జాతరను మార్చి 10న రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు ప్రజా కళాకారులు దరువు అంజన్న,దరువు ఎల్లన్నలు తెలిపారు. శనివారం దరువు జాతర గోడ పత్రికను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, ప్రొ. గాలి వినోద్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు సిరిపురం యాద య్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ దరువు అనేది  25 ఏళ్ల  క్రితం చదువుల తల్లి ఉస్మానియ విశ్వవిధ్యాలయం ఒడి లో పురుడు పోసుకుందన్నారు. ఆ నాడు మొదలైన దరువు నేటి వరకు తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం ఉద్యమ స్పూర్తిని రగిలిస్తూ నేడు దరువు జాతరకు సిద్దమైందని తెలిపారు. మార్చి 10న ఉదయం మొద లుకొని సాయంత్రం వరకు తెలంగాణ దరువు కార్యక్రమాలు కొనసాగతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆద్యాంతం ఉత్యమ స్పూర్తిని రగింలించేలా అమరుల త్యాగాలను కీర్తిస్తూ కొనసాగింది. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జర్నలి స్టు విఠల్, పృద్విరాజ్, విమలక్క, అంతర్పుల నాగరాజు, వరంగల్ రవి  పాల్గొన్నారు.