calender_icon.png 21 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ స్పూర్తి నింపిన మహనీయుడు దాశరథి

23-07-2024 01:22:48 AM

తెలంగాణ భవన్‌లో ఘనంగా దాశరథి శత జయంతి వేడుకలు

పాల్గొన్న మాజీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : సాహితీ రంగంలో చెరగని ముద్ర వేసుకున్న దాశరథి ప్రజల్లో ఉద్యమ స్పూర్తి నింపిన మహనీయుడని మాజీ స్పీకర్ మధుసూదనా చారి కొనియాడారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి దాశరథి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాకవి దాశరథి అని ప్రశం సించారు. బీఆర్‌ఎస్ హయాంలో దాశరథి జయంతి వేడుకలను ప్రారంభించామని, పదేళ్ల పాటు ఘనంగా నిర్వహించామని తెలిపా రు. ఆయన పేరు మీద అవార్డులు తీసుకొచ్చి కవులను, గాయకులను సత్కరించామన్నారు.