calender_icon.png 18 August, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుడు దాశరథి

23-07-2024 01:23:34 AM

తెలంగాణ కోటి రతనాల వీణ అని చాటిన గొప్ప కవి: కేటీఆర్ 

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): నా తెలంగాణ కోటి రత నాల వీణ అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు, సాహితీవేత్త దాశరథి కృష్ణమాచార్యులు అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ  పద్యాన్ని ఆయు ధంగా మలిచి పీడిత ప్రజల పక్షాన పోరాడిన యోధుడు, తన రచనలతో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచి తెలంగాణ బిడ్డల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహాకవి అన్నారు.  సాహితీ రంగంలో చెరగని ముద్ర వేసిన దాశరథి కథలు, నాటికలు, కవితలు, సినిమా పాటలు వంటి ఎన్నో రచనలు చేసి పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా గెలుచుకున్నారని తెలిపారు.