10 May, 2026 | 12:53 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

17-03-2026 03:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో మొరం తవ్వకాలు చేపడుతున్న చెరువును మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డపై వెంటనే చర్యలు తీసుకోవాలని అవసరమైతే కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. చెరువు శిఖం భూములు మొరం తవ్వకుండా రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ మైనింగ్ అధికారి హరిప్రసాద్ మండల రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు