10 May, 2026 | 11:54 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

బావుసాయిపేట రైతు వేదికలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం

17-03-2026 03:47 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామ రైతు వేదికలో  (అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా రసాయన ఎరువుల వినియోగం, ఆయిల్ పామ్ సాగు, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

అలాగే రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులు, ప్రకృతి వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ పాషా,మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మామిడిపల్లి సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ మల్లారెడ్డి, మండల వ్యవసాయ అధికారి దుర్గారాజు, రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజేంద్ర ప్రసాద్,స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.