ఆ మూడు యాప్‌ల ద్వారా పాకిస్థాన్‌కు డాటా
హనీట్రాప్ ద్వారా బ్రహ్మోస్ శాస్త్రవేత్త నిశాంత్‌కు గూఢచారుల గాలం
ల్యాప్‌టాప్‌లో లింక్‌లు తెరిచేలా చేసి డాటా టాన్స్‌ఫర్
న్యూఢిల్లీ, జూన్ 22: ‘క్యూ విస్పర్’, ‘చాట్ టు హైర్’, ‘ఎక్స్ యాప్‌ల ద్వారా పాకిస్థాన్ గూఢచారులు బ్రహ్మోస్ మాజీ శాస్త్రవేత్త నిశాంత్ అగర్వాల్ ల్యాప్‌టాప్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులతోపాటు భారత్ సైనిక సంబంధిత రహస్యాలను సేకరించారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. నాగపూర్ మిస్సైల్ యూనిట్‌లో పనిచేసిన నిశాంత్ అగర్వాల్‌కు ముందుగా ‘సెజల్’ అనే పాకిస్థానీ ఫేస్‌బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నిశాంత్ రిక్వెస్ట్‌ను అంగీకరించి సెజల్‌తో చాటింగ్ ప్రారంభించాడు. సెజల్ మైకంలో ఉన్న నిశాంత్ ఆ ఐడీ నుంచి ల్యాప్‌టాప్‌కు వచ్చిన లింక్‌లన్నింటినీ ఓపెన్ చేశాడు. దీంతో ల్యాప్‌టాప్‌లో క్యూ విస్పర్’, ‘చాట్ టు హైర్’, ‘ఎక్‌ెే్సట్రస్ట్’ యాప్‌లు ఇన్‌స్టాల్ అయ్యాయి. గూఢచారులు వాటిద్వారా ఆ ల్యాప్‌ట్యాప్‌లోని కీలక సమారచారాన్ని ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. దీనిలో భాగంగానే గూఢచారులకు బ్రహ్మోస్‌కు సంబంధించిన సమాచారమూ చేరింది. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేసినందుకు 2018లో ఉత్తరప్రదేశ్ టెర్రర్ స్కాడ్ నిశాంత్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసింది. ఈకేసులో నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించింది.






