9 July, 2026 | 12:27 AM

అమ్మ మాటలు విని షాక్ అయ్యా

17-12-2024 12:00 AM

  సుపర్’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుష్క. తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకున్న అనుష్క ఆ తరువాత వరుస సినిమాల్లో రాణించారు. అయితే ఎప్పుడూ గ్లామర్ పాత్రలపై మాత్రం ఆమె పెద్దగా దృష్టి సారించలేదు. అయినా సరే.. ఇండస్ట్రీలో అనుష్క ఓ స్థాయిలో రాణించారు. అయితే ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’ చిత్రం కోసం మాత్రం అనుష్క బికినీ వేశారు. అయితే అనుష్క వాళ్ల అమ్మ మాత్రం ఆమెప్పుడూ పద్ధతిగా ఉండాలని అనుకుంటారట. బిల్లా సినిమా చూశాక ఆమె మాటలు విని అనుష్క షాక్ అయ్యారట. “బిల్లా’ సినిమా చూసినప్పుడు ‘ఇంకా స్టులిష్‌గా ఉండొచ్చు కదా. సగం పద్ధతిగా, సగం మోడ్రన్‌గా డ్రెస్సులేంటి?’ అని అమ్మ అన్నారు” అని అనుష్క చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటీ’ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వేదం’ తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది.