14 July, 2026 | 1:17 PM

బేగంబజార్‌లో దారుణం.. భర్త, అత్తపై హత్యాయత్నం

17-05-2024 01:35 PM

హైదరాబాద్:  బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం దారుణం చోటుచేసుంది. కుటుంబకలహాలతో భర్త, అత్తపై కోడలు దాడి చేయించింది. ఈ దాడిలో భర్త రామేశ్వర్, తల్లి గంగాభాయి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమే కత్తులు, కర్రలతో దాడి చేయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కోడలు, ఆమె సోదరులపై బేగంబజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.