తన ప్రేమకు అడ్డు పడుతుందని.. తల్లిని చంపిన కూతురు
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జీడిమెట్ల పోలీస్ స్టేషన్(Jeedimetla Police Station) పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు మోసి, కనిపెంచిన తల్లినే కూతురు(Daughter) దారుణంగా హత్య చేసింది. కుమార్తె తేజశ్రీ తల్లి అంజలిని గొంతునులిమి, విచక్షణారహితంగా తలపై కొట్టి కడతేర్చింది. ప్రేమవ్యవహారంలో తల్లి మందలించిందని కుమార్తె ఈ దారుణానికి పాల్పడింది. ఆమె ప్రియుడు, అతని తమ్ముడితో కలిసి తేజశ్రీ తల్లిని చంపి అడ్డు తోలగించుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు(Jeedimetla Police) కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తన ప్రేమకు అడ్డుపడుతోందనే కోపంతోనే తల్లిని చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.






