4 April, 2026 | 10:48 PM

నవ దంపతులను ఆశీర్వదించిన దయాకర్ రెడ్డి

04-04-2026 08:55 PM

కూసుమంచి,(విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి శనివారం కూసుమంచి మండలంలో పర్యటించారు. కూసుమంచి మండలం లోక్యతండ గ్రామానికి చెందిన వడిత్య అనూష-విష్ణువర్ధన్, వడ్తియా కళ్యాణి-రాజేష్  వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సంపదలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.