calender_icon.png 23 September, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నో అడ్డంకులు వచ్చిన అనుభవం ఉన్నా వారికే పదవి అప్పగించాను

30-11-2024 12:00:41 AM

వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

కామారెడ్డి (విజయక్రాంతి): ఎన్నో అడ్డంకులు వచ్చిన అనుభవం ఉన్న వారికే బీర్కూర్ మార్కెట్కమిటి పదవిని అప్పగించానని రాష్ట్ర వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్లో మార్కెట్ కమిటి నూతనపాలకవర్గం ప్రమాణాస్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. బీర్కూర్ మార్కెట్కమిటీ నూతన అధ్యక్షురాలిగా దుర్గం శ్యామలశ్రీనివాస్, వైస్ చైర్మన్గా య్యామరాములు, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలను తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి శ్యామల ఉమ్మడి బీర్కూర్ ఎంపీపీగా, దుర్కి సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు.

రైతులకు మంచి సేవా చేసి పేరు తెచ్చుకోవాలన్నారు. బీర్కూర్ మండలంలో నిజమైన కార్యకర్తకు మార్కెట్ కమిటి చైర్మన్ పదవి రావాలని సంకల్పించినట్లు తెలిపారు. దీనికి తోడుగా రాష్ట్ర అగ్రో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కూడా సమర్థించారని తెలిపారు.ఎన్నో అడ్డంకులు వచ్చిన పెద్దలను ఒప్పించానని తెలిపారు. కొంతమందికి బాధ కలిగి ఉండవచ్చుకానీ సరైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్  యమ రాములు సీనియర్ కాంగ్రెస్ పార్టీనాయకులు కావడంతో వైస్ చైర్మన్ ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఎంపిక చేసిన పేర్లను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు అందజేయడంతో ప్రభుత్వం బీర్కూర్ మార్కెట్ కమిటి చైర్మన్గా శ్యామలను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు.

రైతు రుణమాఫీని ఇప్పటికే రెండు లక్షల లోపు ఉన్న రైతులకు 23 లక్షల మందికి 18 వేలకొట్ల రుణమాఫీని చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఇంకా కొంతమంది రెండు లక్షల రూపాయిల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. సాంకేతిక సమస్యల వల్ల రుణమాఫీ కాలేదని వారు 4 లక్షల మంది రైతులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వారికి రూ.2500 కొట్ల రూపాయిల రుణమాఫీ ప్రభుత్వం చేయబోతుందన్నారు. మిగిలిన రెండు లక్షల రూపాయిల కంటే ఎక్కువగా ఉన్న రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. వారికోసం సుమారుగా 12 వేల కొట్లు అవసరమని, త్వరలోనే వారికి రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.